అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. కానీ.. మూడు కార్పొరేషన్ల ఛైర్మన్లు మాత్రం ఏవేవో లెక్కలు వేసుకుని టికెట్ కోసం ట్రయిల్స్ మొదలుపెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నియోజకవర్గం కావడంతో అధికారపార్టీ నేతల ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కంటోన్మెంట్ టీఆర్ఎస్ రాజకీయాల్లో మలుపులు ఉంటాయా?గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఇక్కడ ఎమ్మెల్యే సాయన్న టీఆర్‌ఎస్సే.…