తెలంగాణలో పెద్ద ఎత్తున మెంబర్ షిప్ చేయించాలని కృతనిశ్చయంతో వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ దిశగా నేతలు, కార్యకర్తల్ని ముందుకు నడిపిస్తున్నారు. 5 మండలాలలో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ గెలుస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. 35 మండలాలలో బలంగా ఉంటే ఎంపీ స్థానం గెలుస్తాం.. 600 మండలాలలో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని రేవంత్ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు. మండలాలలో అధ్యక్షులు సరిగా పని చేయకపోతే వారిపై చర్యలు…