ఇతర పార్టీలన్నీ జనాల్లో దూసుకుపోతుంటే.. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రోజు రోజుకూ డీలా పడిపోతున్నారు. సోనియాగాంధీకి వయోభారం.. ఆమె స్థాయిలో పార్టీని రాహుల్ నడిపించడానికి ముందుకు రాకపోతుండడం.. ఇతర సీనియర్లు సైతం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపని వైనం.. ఈ కారణాలతో పార్టీ శ్రేణుల్లో రోజురోజుకీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ కు బలమైన ప్రజామద్దతు ఇప్పటికీ ఉంది. బీసీలు, మైనారిటీలు చాలా ప్రాంతాల్లో నేటికీ ఆ పార్టీని…