భారత్‌లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే కేరళలో నిత్యం 10 వేలకు పైగానే కేసులు బయటపడుతున్నాయి. కేరళలో కొవిడ్ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి… ఇక, కేరళలో సెకండ్ వేవ్‌లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. మరోసారి భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం.. వీకెండ్‌లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయానికి వచ్చింది.. ఈ నెల 24, 25 తేదీల్లో (శనివారం,…
కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ చేయడానికి మరోసారి దేశ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్నవార్తలు వైరల్ గా మారిపోయాయి.. లాక్‌డౌన్ బాధ్యత మాది కాదు.. కేసుల తీవ్రత, పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. అయినా ఈ వార్తలు ఆగడంలో.. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే, దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్…
భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.. పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.. తాజాగా తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి వచ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది ప్రభుత్వం.. ఇక, మే 2వ తేదీన రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్ అమలుచేయనున్నారు.. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మే 2న కౌంటింగ్ ప్రక్రియతో పాటు…