సాప్ట్ వేర్ ఇంజనీర్ నుంచి నటుడుగా మారిన రఘు కారుమంచి ఇప్పుడు మరో బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. 2002లో ‘ఆది’తో నటుడు అయిన రఘు ఆ తర్వాత పలు చిత్రాలలో హాస్య పాత్రలతో అలరించటమే కాదు జబర్ దస్త్ షోలో రోలర్ రఘుగా టీమ్ లీడ్ చేశాడు. కరోనా టైమ్ లో ఫార్మింగ్ మీద దృష్టి పెట్టి సమర్థవంతంగా వ్యవసాయం చేస్తూ వచ్చాడు రఘు కారుమంచి. ఇప్పుడు అనుకోకుండా మిత్రులతో కలసి మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.…