Andhra Pradesh: అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయం ముందు రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెన్నుకు సంబంధించిన సమస్యతో అనారోగ్యానికి గురైన తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ ఆమె సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను గురువారం నాడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, విజయవాడ…