Dharani Special Drive: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది.
ఇదంతా బీజేపీ కుట్ర.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్.. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్పై దాడి చేశాడు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను బిభవ్ ఏడు సార్లు చెంపపై కొట్టడమే కాకుండా, సున్నిత భాగాలపై కడుపులో తన్నాడని ఆమె ఆరోపించింది. ఈ రోజు ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్…
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు…
ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ను సరఫరా చేసిందని, ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించామని ఆయన తెలిపారు. కరెంట్ కోతలు సరిదిద్దాలనే…
KTR: అప్పు అనేదే తప్పు అన్నట్లు ప్రచారం చేసిన కాంగ్రెస్ సన్నాసులు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండు ముఖ్యమైన అంశాలు ప్రజల దృష్టికి తీసుకురావాలని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు.
CM Revanth Reddy:నేడు నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని మాట్లాడేటోడికి.. మెదడు తక్కువ ఉన్నట్టు ఉందని దుయ్యబట్టారు. అది ఎప్పుడు చేస్తారో తెలియదు.. కేంద్రపాలిత ప్రాంతం అనేదే ఉండదన్నారు. కేటీఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. సెకండ్ క్యాపిటల్ చేయండి అని కేటీఆర్ డిమాండ్ చేశాడు కదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ మీద ఫోకస్, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం.. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం…