CM Revanth Reddy: రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి TGSWREIS ఆవరణలో మహబూబ్‌నగర్ ఐఐఐటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఐఐఐటీ నిర్మాణానికి సంబంధించి నిర్వహించే భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. విద్యా రంగాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా…