కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ధాన్యం కుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి కానీ మీ గుండెలు కరుగటం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతుకష్టాలు కానొస్తలేవా ? అంటూ నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే, మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి…