Pawan Kalyan- CM Chandrababu రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించిన ముఖ్యమంత్రి, త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.