Home
Cjp Protests
Cjp Protests News
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
Lal Hit Janata Party: నీట్ పేపర్ లీక్‌పై జంతర్ మంతర్ నిరసనల తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకువచ్చిన ఈ సీజేపీ ఇప్పుడు సీఈసీని టార్గెట్ చేస్తోంది. ఇదిలా, సీజేపీకి వ్యతిరేకంగా ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ఏర్పాటైంది. ఆదివారం ఢిల్లీలోని మాలవ్య స్మృతి భవన్లో ఈ గ్రూపు తొలి సభ్యత్వ… -
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
Dharmendra Pradhan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP), కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విద్యార్థులు, జాతీయ ప్రయోజనాలతో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు దేశంలో అరాచకాన్ని సృష్టించి, రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నంగా మారాయని ఆయన ఆరోపించారు. ఎక్స్ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని మార్చాలని, బంగ్లాదేశ్ ఉద్యమం మాకు స్పూర్తి బహిరంగంగా మాట్లాడటం వెనక వారి అసలు ఉద్దేశాన్ని… -
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
CJP Protest: ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ‘‘ఫేక్ కంటెంట్’’ ఇంటర్నెట్ను ముంచెత్తింది. ఇలా నకిలీ వార్తల్ని, కథనాలను ప్రచారం చేసిన సోషల్ మీడియా ఖాతాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేశాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారం… -
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
Mahant Rajudas: అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్‌గఢి ఆలయ మహంత్ రాజూదాస్ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనలపై తీవ్రంగా స్పందించారు. నిరసనల్లో పాల్గొంటున్న జెన్-జీపై ప్రధాని నరేంద్రమోడీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ నిరసన తెలుపుతోంది. దీనిపై రాజూదాస్ మాట్లాడుతూ.. జెన్-జీ యువత దేశాన్ని ఏకం చేయాలి, కానీ విభభించేది కాదని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని భావించే యువతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్… -
Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
Tamil Nadu: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో మళ్లీ యూ-టర్న్ తీసుకుంది. వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 14న పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఈ ఆదేశాలు జారీ కాగా.. తీవ్ర విమర్శలు రావడంతో ఆగస్టు 19న వెనక్కి తీసుకుంది.… -
CJP: కేంద్రానికి సీజేపీ తాజా అల్టిమేటం.. సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి..
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేంద్రానికి తాజాగా మంగళవారం మరో అల్టిమేటం ఇచ్చింది. నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, విద్యార్థి నిరసనకారులపై ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలనే హామీపై కేంద్రం వెనక్కి తగ్గుతోందని సీజేపీ ఆరోపించింది. మంగళవారం లోగా కేసులు విత్ డ్రా చేసుకోకుంటే మళ్లీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించింది. మంగళవారం నీట్ పేపర్ లీక్ నిరసనల్లో అరెస్టైన వారిలో 18 ఏళ్లలోపు, నేర చరిత్ర లేని నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ విడుదల చేయాలని… -
Dharmendra Pradhan: షాకింగ్.. రెండు సార్లు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ..
Dharmendra Pradhan: సీజేపీ నిరసనలు, దేశ వ్యాప్తంగా ఉద్యమం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రాజీనామాకు ముందు జరిగిన పులు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల నిరసనల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రెండుసార్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారట. ప్రభుత్వం రాజీనామాను తిరస్కరించి విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంపైనే దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూలై 20న జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలోనూ ప్రధాన్… -
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్‌చాట్’’ యాప్‌పై కేంద్రం చర్యలు..
Bitchat: ఢిల్లీలో కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో ‘‘బిట్‌చాట్ యాప్’’ కీలకంగా మారింది. మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ లేకున్నా బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ వల్ల నిరసనలు తీవ్రమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ యాప్‌పై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ యాప్‌ను రూపొందించిన గిట్‌హబ్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. బిట్‌చాట్ మెసేసింగ్ యాప్‌కు సంబంధించిన గిట్‌హబ్ రిపోజిటరీలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ సహవ్యవస్థాపపకుడు జాక్…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!