దేశంలో కరోనా తీవ్రత తగ్గలేదు. కోవిడ్ పాజిటివ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. 15-18 ఏళ్ల లోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషనుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.2022 జనవరి 3 తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయనుంది ప్రభుత్వం.కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ వయస్సున్న వారందరికీ ప్రస్తుతం కోవాక్సిన్ టీకాను మాత్రమే వేస్తున్నట్టు ప్రకటించింది వైద్యారోగ్యశాఖ. 2007 కంటే ముందు పుట్టిన వారంతా ఈ వ్యాక్సిన్ డోసుకు అర్హులని…