Rachakonda CP: బుధవారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా రేపటి మ్యాచ్‌కు భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్య, ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మ్యాచ్‌కు ఎంట్రీ- ఎగ్జిట్ బోర్డులు పెట్టామని.. ప్లేయర్స్ ఎంట్రీ గేట్ నుంచి బయట వ్యక్తులకు ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. ఆటగాళ్లకు ఇబ్బంది కలిగిస్తే…