ప్రధానమంత్రి మోడీ స్వాతంత్య్ర దినోత్సవం వేళ తీపికబురును అందించారు. ఈసారి ప్రజలకు దీపావళి డబుల్ బహుమతి లభిస్తుందని అన్నారు. దీపావళి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ(GST) భారం తగ్గిస్తున్నట్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రకటించారు. జీఎస్టీ నిపణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘మేము పన్ను వ్యవస్థను సరళీకృతం చేశాము. గత ఎనిమిది సంవత్సరాలలో, మేము GST లో భారీ సంస్కరణలు చేశాము. దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించాము. మేము తదుపరి తరం GST…