కొన్ని ఎద్దులు మనుషులను చూడటంతోనే చిర్రెత్తిపోతాయి. వాటికి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ.. ఉరకలేసుకుంటూ వస్తూ.. మీద పడుతాయి. ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిపై అక్కడే ఉన్న ఎద్దు దాడి చేసింది. భయంతో ఎద్దు దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కాడు. అయినప్పటికీ ఆ ఎద్దు అతన్ని వదలకుండా ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ కోపంతో ఊగిపోయింది.