జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్‌లో ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. అక్టోబర్ 9, 10 తేదీలలో ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ‘ఎలైట్ క్రికెట్ లీగ్’ ద్వారా సేకరించిన నిధులను అమరవీరుల కుటుంబాలకు అందజేయనున్నారు.