ఉద్యోగుల పీఆర్సీతో పాటు హెల్త్ కార్డుల విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దుపై నియమించిన కమిటీ నివేదిక అందింది జూన్ లోగా దీనిపై సహేతుకమైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. పెరిగిన పీఆర్సీ, 5 డీఏ బకాయిలు అన్ని ఆర్థిక ప్రయోజనాలు జనవరి 2022 నుంచే చెల్లిస్తామని తేల్చి చెప్పారని. 1.28 లక్షల మంది గ్రామ…