CM Chandrababu: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ…