CM Chandrababu: నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని గుర్తు చేశారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజల అసంతృప్తి నేపథ్యంలో రీ సర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు.…