AP Excise Suraksha App: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటని అన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించిందని, దానిని లీగలైజ్ చేసిందని విమర్శించారు. గత పాలకులు గంజాయిని వాణిజ్య పంటగా భావించి పండించారు, సరఫరా చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించిందని…
YS Jagan: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీపై మాజీ సీఎం స్పందించారు. నకిలీ లిక్కర్ తయారీలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చదిద్దాలని కంకణం కట్టుకున్నారా.? టీడీపీ నేతలు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని పెట్టి సప్లై చేస్తున్నార అని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. నకిలీ మద్యానికి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు.