Chandra Bose: "మంచు కొండల్లోన చంద్రమా... చందనాలు చల్లిపో..." అంటూ వచ్చిన చంద్రబోస్ తెలుగువారిపై తన కవితాచందనాలు చల్లుతూనే పున్నమినాటి వెన్నెల విహారాల ఆనందాన్ని అందిస్తున్నారు. తన దరికి చేరిన ఏ అవకాశాన్నైనా ఇట్టే వినియోగించుకోగల చంద్రబోస్ వద్ద ఉన్న పదసంపద అగణితం! "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..." అంటూ