రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు వినూత్నంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మరోసారి పోటీ చేస్తారా లేక.. ఆయనకు బదులుగా కొత్తగా పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ ఇస్తారా అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకులు వేములవాడలో పోటాపోటీగా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదే స్పీడ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కేడర్‌ను మరింత గందరగోళంలోకి నెడుతోందట. కొంతకాలంగా ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై వివాదం చెలరేగుతోంది. సమస్య కోర్టు…