కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి సుతిమెత్తని హెచ్చరిక చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సామాన్యుల కంటే పదవులు పొందిన వారు ప్రత్యేకం కాదనే స్పృహతో పని చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల విషయంలో కామెంట్లు చేసిన వారికి సీఎం క్లాస్ తీసుకున్నారు.