గోవాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కసాయి తల్లి తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని గోవా నుంచి కర్ణాటకకు వెళుతుండగా.. గోవా పోలీసులు ఆమెను కర్ణాటకలోని చిత్రదుర్గలో అరెస్టు చేశారు.