తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు సంబంధించిన స్టేటస్‌ను మంగళవారం నాడు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విమానాయానశాఖ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో, మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. Read Also:…