కారు ట్రైల్ వేస్తానని నమ్మబలికి కారుతో సహా ఉడాయించిన దుండగుడు. OLX ఆన్ లైన్ లో కారు అమ్మకానికి పెట్టి మోసపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం పల్లేవాడ గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన చాట్ల వంశీ కృష్ణ అనే యువకుడు ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగం లేకపోవడంతో కారు నడుపుకుంటూ జీవనం సాగించాలని ఫైనాన్స్ లో కారు కొన్నాడు. మూడు నెలలు గడిచాక కారు కిస్థిలు కట్టలేక ఫైనాన్స్…