ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజుల్లోనే ఎన్నికల సమరం జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారంతో నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. మొత్తం 28 నామినేషన్‌లలో 13 మంది అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ దూరంగా ఉండటంతో పోటీ ప్రధానంగా వైసీపీ, బీజేపీల…