నవంబర్ 29. నేటి బీఆర్‌ఎస్, నాటి టీఆర్‌ఎస్ చరిత్రలో మర్చిపోలేని రోజు. తెలంగాణ ఉద్యమ పథంలో... ఆఖరి అస్త్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న రోజు. 2009లో అదే రోజున ఆయన దీక్ష ప్రారంభించడం, ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామన్న నాటి కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కేసీఆర్ దీక్ష విరమించడం తెలిసిందే. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా పదేళ్ళు అధికారంలో ఉంది బీఆర్‌ఎస్. నవంబర్…