నలభై ఏళ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ నిన్న చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి బడ్జెట్ రూపొందించారని..ఎన్నికల వాగ్దానాలను కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి రూ.7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని.. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క కార్యకరమైనా తమ ప్రభుత్వం నిలిపివేసిందా? అని ప్రశ్నించారు.