తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఇక్కడే బీఆర్‌ఎస్ కాస్త గందరగోళంలో ఉందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. లగచర్ల భూ సేకరణ వివాదం నెల రోజుల నుంచి రాజకీయంగా నలుగుతోంది. ఈ ఎపిసోడ్‌లో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది గులాబీ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా సిటీ ఏర్పాటు ప్రయత్నం చేసింది…