రాయల్ ఎన్ఫీల్డ్ మే అమ్మకాల బ్రేకప్ డేటాను కంపెనీ విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం 7 మోడళ్లను విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. 4 వార్షిక క్షీణత ఎదుర్కోగా, 3 వార్షిక వృద్ధిని సాధించాయి. రాయల్ ఎన్ఫీల్డ్ భారీ డిమాండ్ ఉన్నప్పటికీ గత నెలలో అమ్మకాలు తగ్గాయి. అయితే.. ప్రతిసారీ మాదిరిగానే క్లాసిక్ 350 అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా నిలిచింది.