తిరుమల శ్రీవారి టికెట్లు ఏవైనా క్షణాల్లో అమ్ముడవుతుంటాయి. తాజాగా టీటీడీ సర్వదర్శనం టోకెన్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. జనవరి నెలకు ఆన్ లైన్ లో రెండు లక్షల 60 వేల టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. టోకెన్లు విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకున్నారు భక్తులు. టోకెన్ల బుకింగ్ పూర్తయిన విషయం తెలియక టీటీడీ వెబ్ సైట్ లో లాగిన్ అవుతున్నారు వేలాది మంది భక్తులు. వారికి నిరాశే కలుగుతోంది. రేపు శ్రీవాణి…