Justice Surya Kant: భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ స్థానంలో ఆయన అత్యున్నత న్యాయ పదవికి నియమితులయ్యారు. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సూర్యకాంత్ నియామకాన్ని ధ్రువీకరించారు. “భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను నవంబర్ 24 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి రాష్ట్రపతి…