అలనాటి కథానాయకుడు రాజేశ్ కుమార్తె ఐశ్వర్య రాజేశ్ కు తెలుగులో కంటే తమిళ చిత్రసీమలో వచ్చిన గుర్తింపు ఎక్కువ. గ్లామర్ డాల్ గా కాకుండా అర్థవంతమైన సినిమాలు, పాత్రలు చేస్తున్న ఐశ్వర్యా రాజేశ్ కు ఇటీవలే తెలుగులోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ‘కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీస్ లో నటించిన ఐశ్వర్య ‘రిపబ్లిక్, టక్ జగదీశ్, భీమ్లా నాయక్’ చిత్రాలలోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మొన్నటి వరకూ…