ఈ తరానికి హెలెన్ అంటే సల్మాన్ ఖాన్ పిన్ని అని, లేదా ఓ సీనియర్ యాక్ట్రెస్ అని మాత్రమే తెలుసు. కానీ, ఆ నాటి ప్రేక్షకులకు హెలెన్ శృంగార రసాధిదేవత! ఐటమ్ గాళ్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న మేటి డాన్సర్ హెలెన్. ఆ రోజుల్లో హెలెన్ పాట కోసం జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు హెలెన్. అయితే వందలాది సినిమాల్లో ఐటమ్స్ తోనే మురిపించారు. హెలెన్ దాదాపు 700…