అహ్మదాబాద్‌లో నిన్న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి గుజరాత్ ఏటీఎస్ ఓ డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకుంది. ఏటీఎస్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి దానికి తీసుకెళ్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంశంపై అతడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. "ఈ డీవీఆర్‌ని శిథిలాల నుంచి మేము స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్ఎస్ఎల్ బృందం త్వరలో ఇక్కడికి వస్తుంది." అని సమాధానం ఇచ్చారు.