ఏపీలో ఎన్నికలకు ముందే పొత్తు పొడుపులు పొడుస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఈమధ్యే మూడు ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి 1) జనసేన+బీజేపీ పొత్తు, 2) జనసేన+టీడీపీ+బీజేపీ పొత్తు, 3) జనసేన ఒంటరిగా పోటీ చేయడం. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు రెండురోజులుగా ఏపీలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. జేపీ నడ్డాతో జరిపిన కోర్ కమిటీ భేటీలో పౌత్తుల అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. పొత్తులపై…
తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఉద్యమానికి భారతీయ జనతాపార్టీ రెడీ అవుతోంది. ‘ప్రజా బ్యాలెట్’ పేరిట ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసింది బీజేపీ. బషీర్ బాగ్ లో రేపు ‘ప్రజా బ్యాలెట్’ ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ సహా పట్టణాలు, నగరాలుసహా ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సిద్ధమైంది బీజేపీ. ధర్నాలు, ఆందోళనలతో ఛార్జీల పెంపును ఉపసంహరించేదాకా టీఆర్ఎస్ పై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. 22 ఏళ్ల కిందట అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను పెంచడాన్ని…