బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. మద్యపాన నిషేదంఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కల్తీ మద్యం సేవించి 75 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే రాష్ట్రంలోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందారు.