బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఎల్లుండికి తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.