తాజాగా భోజ్‌పురి ఇండస్ట్రీకి చెందిన సూపర్‌స్టార్ పవన్ సింగ్ ఒక ఈవెంట్‌లో హీరోయిన్ నటి అంజలి రాఘవ్ నడుమును అనుమతి లేకుండా తాకిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసిన ‘సైయా సేవ కరే’ అనే ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగంగా లక్నోలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పవన్ సింగ్ తీరును తప్పుబట్టారు.…