గెయిల్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొత్త భరోసా సెంటర్ ఏర్పాటు కోసం గెయిల్ ఇండియా లిమిటెడ్ మరియు భరోసా సొసైటీ మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా, డీఐజీ బి సుమతి, భరోసా టెక్నికల్ డైరెక్టర్ మమతా రఘువీర్, గెయిల్ ఇండియా లిమిటెడ్ ZGM శరద్ కుమార్ తదితరుల సమక్షంలో మంగళవారం ఎంఓయూపై సంతకాలు జరిగాయి.…