దేశంలో బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీల నేతలు తనను కలిసి తమతో చేతులు కలపాలని కోరినట్లు ప్లీనరీలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే తాను వాళ్లతో రానని స్పష్టం చేసినట్లు వివరించారు. ఎవరినో గద్దె ఎక్కించేందుకు లేదా గద్దె దించేందుకు తాను పనిచేయనని చెప్పారు. గద్దె ఎక్కించాల్సింది రాజకీయ పార్టీలను కాదు అని.. ప్రజలను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదని.. ప్రజల జీవితాలు అని…