Omicron Subvariant BF.7 Symptoms: చైనాలో అల్లకల్లోలానికి దారి తీస్తోంది ఓమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్. ఆ దేశంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. జీరో కోవిడ్ విధానాన్ని కూడా చైనా ప్రభుత్వం ఎత్తేయడంతో రానున్న మూడు నెలల్లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని.. జనాభాలో 60 శాతం మంది కోవిడ్ బారిన పడతారని పరిశోధకులు చెబుతున్నారు.