Benin: ఇటీవల కాలంలో పశ్చిమ ఆఫ్రికాలోని అనేక దేశాలు తిరుగుబాట్లకు గురయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో ఆఫ్రికన్ దేశం బెనిన్ కూడా చేరింది. ఆదివారం దేశ సైనికుల బృందం అకస్మాత్తుగా అధికారిక టీవీ ఛానెల్‌లో ప్రత్యక్షం అయ్యి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. “మిలిటరీ కమిటీ ఫర్ రీఫౌండేషన్” అని ఆ సైనిక బృందం తమను తాము పిలుచుకుంటూ, దేశ అధ్యక్షుడిని, అన్ని రాజ్యాంగ సంస్థలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సైన్యం దేశానికి కొత్త అధిపతిగా…