కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకుంది. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయొద్దంటూ బెంగళూరు వ్యాప్తంగా కర్ణాటక జలసంరక్షణ సమితి, వివిధ రైతుసంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి కావేరీ నదీ జలాల వివాదం తెరమీదకు వచ్చింది. అసలు ఈ వివాదం ఏంటి.. ఎప్పుడు ప్రారంభమైందంటే..
కర్ణాటక జల సంరక్షణ సమితి, ఇతర రైతు సంఘాలు మంగళవారం బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. తమిళనాడుకు కావేరీ జలాలను కర్ణాటక విడుదల చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బెంగళూరులో బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Cauvery row: కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారు. నీటి విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్ కి పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే మరోవైపు మాండ్యా జిల్లాలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరికొన్ని సంఘాలు బందుకు పిలుపునిచ్చే యోచనలో ఉన్నాయి.