ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన పేద ప్రజలు డబుల్ బెడ్‌రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి వాటిని ఆక్రమించుకున్నారు. దాదాపు వంద కుటుంబాలకు చెందిన ప్రజలు మూకుమ్మడిగా ఇళ్లలోకి ప్రవేశించారు. కరెంటు, తదితర కనీస సౌక ర్యాలు లేకున్నా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. అక్రమంగా ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశిం చారనే నెపంతో పలువురిపై కేసులు నమోదు చేసినా ప్రజలు…