Telangana : తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన “తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం”గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి తన నిబద్ధతను మళ్ళీ ఉద్ఘాటించిందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి…