హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టులను ఈ ఏడాది మార్చి నాటికి ప్రారంభించనున్నారు. తుకారాం గేట్ రోడ్ అండర్ బ్రిడ్జి, బహదూర్‌పురా ఫ్లైఓవర్, బైరామల్‌గూడ ఫ్లైఓవర్, బైరామల్‌గూడ అండర్ పాస్ వంటి ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు…
బహదూర్‌పురా వద్ద ఆరు-లేన్ల ద్విదిశాత్మక ఫ్లైఓవర్ వేగంగా పూర్తవుతోంది. ఈ సౌకర్యం దశాబ్దాలుగా ఓల్డ్ సిటీని వేధిస్తున్న ట్రాఫిక్ గందరగోళాన్ని తగ్గించగలదని భావిస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం చివరి దశలో ఉందని, మార్చి 31 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు తెలిపారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను జీహెచ్‌ఎంసీ రూ.69 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. 690-మీటర్ల…