తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం దగ్గరకు వచ్చిన గవర్నర్ కు ఉత్సవ సమితి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత.. భారీ గణనాథుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే.. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. విఘ్నేశ్వరుడి ప్రతిమ 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు సృష్టించింది. ఇక ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి.. ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని…