టాలీవుడ్‌లో హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఈ విజయాల్లో ముఖ్యంగా ఇద్దరు డైరెక్టర్లకు సింహ భాగం ఉంది. గతంలో బాలయ్య-బి.గోపాల్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అయ్యేది. వీరిద్దరి కాంబోలో చాలా హిట్లు ఉన్నాయి. లారీడ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలం కావడంతో ఆ…